సెల్యూట్ సోనూసూద్

జాతీయం విద్య స్పెషల్ ఫోకస్

.

సెల్యూట్ సోనూసూద్

పేదల పాలిట మహానుభావుడు

అసల..సిసల హీరో

రీల్లోనే కాదు రియల్ గా కూడా నెంబర్ వన్ అనిపించుకుంటున్న సోనూసూద్

ఐ లవ్ సోనూసూద్ అంటున్న ప్రజలు

బడా వ్యాపారులు. హీరోలు.పారిశ్రామికవేత్తలు సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న ప్రజలు

పేదలకు సోనూ.. ఉచిత విద్య

తన తల్లి పేరిట స్కాలర్‌షిప్‌                                                                                                                                                                             స్టాఫ్ రిపోర్టర్
కే.రోసిరెడ్డి
98866 99035

ముంబయి: *లాక్‌డౌన్‌ కాలం నుంచి పేదలకు తనవంతుగా సాయమందిస్తూ అందరి మదిలో నిలిచిన బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించబోతున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేయడమే కాకుండా.. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు బస్సులు, రైళ్లు, విమానాలు తదితర ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు సోనూ సూద్‌. అంతేకాదు సోషల్‌మీడియా వేదికగా అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి  వివిధ రూపాల్లో వారికి అండగా నిలిచారు. ఇప్పుడు పేదలకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొస్తున్నారు. స్కాలర్‌షిప్‌ కోసంద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలనేది షరతు విధించారు. అటువంటి వారి కోర్సు ఫీజు, వసతి, ఆహారం.. అన్నీ మేమే చూసుకుంటాం’ అని సోనూ పేర్కొన్నారు. ‘‘పేద విద్యార్థులకు సాయం చేయమని నా తల్లి నన్ను కోరేవారు. ఇన్నాళ్లకు ఈ రూపంలో దాన్ని నెరవేరుస్తున్నా’’ అని సోనూ తెలిపారు.వ్యాపారులు. హీరోలు.పారిశ్రామికవేత్తలు సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న ప్రజలు

పేదలకు సోనూ.. ఉచిత విద్య

తన తల్లి పేరిట స్కాలర్‌షిప్‌

ముంబయి: లాక్‌డౌన్‌ కాలం నుంచి పేదలకు తనవంతుగా సాయమందిస్తూ అందరి మదిలో నిలిచిన బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించబోతున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేయడమే కాకుండా.. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు బస్సులు, రైళ్లు, విమానాలు తదితర ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు సోనూ సూద్‌. అంతేకాదు సోషల్‌మీడియా వేదికగా అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి  వివిధ రూపాల్లో వారికి అండగా నిలిచారు. ఇప్పుడు పేదలకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొస్తున్నారు. స్కాలర్‌షిప్‌ కోసంద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలనేది షరతు విధించారు. అటువంటి వారి కోర్సు ఫీజు, వసతి, ఆహారం.. అన్నీ మేమే చూసుకుంటాం’ అని సోనూ పేర్కొన్నారు. ‘‘పేద విద్యార్థులకు సాయం చేయమని నా తల్లి నన్ను కోరేవారు. ఇన్నాళ్లకు ఈ రూపంలో దాన్ని నెరవేరుస్తున్నా’’ అని సోనూ తెలిపారు.              scholarships@sonusood.me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *