దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి

ఆంధ్రప్రదేశ్ భక్తి స్పెషల్ ఫోకస్

ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ

దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి

తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన సరస్వతి దేవీ దర్శనం

జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి పోటెత్తిన భక్త జనం

వినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ మార్గం ద్వార భక్తులను పంపిస్తున్న అధికారులు

బంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లిగా సాక్షాత్కారిస్తున్న దుర్గమ్మ

త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది.

ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *