రెడ్ క్రాస్ ప్లాస్మా కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి-రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకు మురళి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం నెల్లూరు స్పెషల్ ఫోకస్

కోవిడ్ రోగులకు అందించే ప్లాస్మా ప్యాకెట్లను అక్రమంగా అమ్ముకుంటూ, చెన్నై లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రితో ఒప్పందం చేసుకుని ప్లాస్మా దందాను నిర్వహిస్తూ లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్ క్రాస్ చైర్మన్,బ్లడ్ బ్యాంకు కన్వీనర్ మరియు కొందరు కమిటీ సభ్యుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకు మురళి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ముందు రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు..ఈ సందర్భంగా మురళి రెడ్డి మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రెడ్ క్రాస్ ప్రతిష్టను భంగం కలిగించేలా నూతన పాలక మండలి వ్యవహార తీరు ఉందని, విద్యను వ్యాపారం చేసి అమ్ముకునే వ్యాపారవేత్తలను సేవా సంస్థల్లో ఉన్నత పదవుల్లో కూర్చోబెడితే జరిగే నష్టం ఏమిటో ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్లాస్మా కుంభకోణంతో ప్రజలకి అర్ధం అయిందని, ఆయన అన్నారు.. నూతన పాలక మండలి ఏర్పడి సంవత్సరం కూడా పూర్తికాకుండానే అనేకమైన అవినీతి ఆరోపణలకు, అక్రమాలకు నెల్లూరు రెడ్ క్రాస్ ను అడ్డాగా మార్చేసిన ఘనత రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు..సేవా సంస్థలో సేవా దృక్పధాన్ని విడిచి పెట్టి, ఒక నియంతలా చైర్మన్ వ్యవహరిస్తున్నారని వారి ఆగడాలకు అడ్డుతగిలే ఉద్యోగులపై బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని తెలియచేసారు..రోగుల నుండి ప్లాస్మా శాంపిల్స్ తీసుకోకుండానే ప్లాస్మా ను రోగులకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు..వీరి నిర్లక్ష్యానికి, ధన దాహానికి కొందరి రోగుల ప్రాణాలు సైతం కోల్పోవడం చాలా బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..రెడ్ క్రాస్ లో జరిగే ఆర్ధిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలని,కానీ ఇక్కడ గోప్యత పేరుతో జీవిత కాల సభ్యులకు సైతం సమాచారం అందుబాటులో ఉంచకుండా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు..రెడ్ క్రాస్ అధ్యక్షులు అయిన జిల్లా కలెక్టర్ గారు ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి,బాద్యులపై కఠిన చర్యలు తీసుకుని,రెడ్ క్రాస్ ప్రతిష్టను,ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ప్రజలందరూ స్వచ్చందంగా రెడ్ క్రాస్ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ సభ్యులు లక్ష్మీ మల్లేశ్వరరావు,మహీధర్ రెడ్డి,కార్తిక్,అమృత్,షఫీ,కిషోర్,హరీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *