గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

ఆంధ్రప్రదేశ్ గూడూరు నెల్లూరు రాజకీయం వైసీపీ

గూడూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

కాంగ్రెస్ పార్టీ నీ మించిన వైసీపీ వర్గపోరు

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి రాజకీయనేత గా పరిణతి చెందని కారణంగా విబేధాలు

ఎమ్మెల్యే వెలగపల్లి ఐ ఏ ఎస్ కావడంతో ఆ హోదా నుండి బయటకు రాకుండా ఉండటం

నియోజకవర్గ పరిధిలో రాజకీయ కక్షలకు చెక్ పెట్టిన వెలగపల్లి

ఆయనది సమపాలన పనితీరు ఎవరికి నచ్చని వైనం

ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు

ఎమ్మెల్యే పనితీరుపై పార్టీలో గందరగోళం

ఎవడి మాట వినని సీతయ్య ఎమ్మెల్యే వెలగపల్లి

ఎమ్మెల్యే వెలగపల్లి పార్టీ విడుతున్నట్లు ప్రచారం వట్టి బోగస్

వెలగపల్లి అపర కుబేరుడు అయిన చిల్లర రాజకీయాలలో కుదేలు

నెక్స్ట్ టికెట్ రాదు అనీ డిసైడ్ తో ఒంటిఎద్దు పోకడలు

పెద్ద కుటుంబాలు అయినా చిన్న కుటుంబాలు అయినా డోంట్ కేర్ అంటున్న వెలగపల్లి

వెలగపల్లి ముక్కసూటి తనంతో అందరూ దూరం

ఎమ్మెల్యే వెలగపల్లి నీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీ గా పంపితే బెటర్ అంటున్న పార్టీ నేతలు

గూడూరు ఉప ఎన్నిక చేపట్టి కొత్త ఎమ్మెల్యే అభ్యర్థినీ నిలబెట్టి గెలిపిస్తే పార్టీలో పోరు అంతం

ఈ మార్గం తప్ప గూడూరు వైసీపీలో పోరు తగ్గే సూచనలు లేవుంటున్న విశ్లేషకులు

మరి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి                                                                                                                                                                                                                                                                                                                                 టీడీపీ నుండి వైసీపీకి ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం ఇప్పటి వరకు చూసాం..! బట్ ఫర్ ఆ చేంజ్… ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీ లేదా బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నారట. అధికార పార్టీలో అంతర్గత రాజకీయాలు.., పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం.., జిల్లాలో కొందరు నేతల పెత్తనం.. తట్టుకోలేక ఆయన పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ కూడా దీన్ని తేలిగ్గా వదలడం లేదు. ఆయన స్థాయిలో ఓ కీలక నివేదిక సిద్ధం చేసుకుని.., త్వరలోనే ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని సమాచారం. ఇంతకూ పార్టీని వీడుతానంటున్న ఎమ్మెల్యే ఎవరు..? ఏమైంది..? ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ప్రణాళికలు ఏమిటి అనేది చూద్దాం..!!

నెల్లూరు జిల్లాలో వైసీపీలో అంతర్గత రాజకీయాలు జోరుగా ఉన్నాయి. ఇద్దరు మంత్రులు.. సీనియర్ ఎమ్మెల్యేలు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కొంతకాలం కిందట అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మరో ట్విస్టు ఏమిటంటే.. ఆయనను పార్టీ నుండి తరిమేయడానికి పార్టీలోని కొందరు నాయకులే పొమ్మనలేకపొగపెడుతున్నారని కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈయన ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారు, కమీషన్లు ఎక్కువ అడుగుతున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలే ఇటీవల ఆయన నివాసం వద్ద ధర్నా చేయడం కొసమెరుపు.అయితే అక్కడ జరిగింది రెండు వర్గాలు తగాదాలు దానిని ఎమ్మెల్యే పై ఎదురుదాడి, జగన్ వల్ల గెలవలేదు,పార్టీ మారుతాను,బీజేపీ లోకి పోతాను అనే మాటలు బోగస్ అనీ వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు, ఇది కుట్రపూరితంగా నేతలు అభివర్ణించడం కొసమెరుపు.

బీజేపీ లేదా టీడీపీ.. ఆపై ఎంపీగా..!!

సదరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు గతంలో ఎంపీగానూ పని చేసారు. 2014 లో వైసీపీ నుండి గెలిచారు. 2019 లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పార్టీలో అంతర్గత కారణాలతో పార్టీని వీడి.., టీడీపీ లేదా బీజేపీ కి వెళ్లి మళ్ళీ తాను ఎంపీగా గెలిచినా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారని జిల్లాలో చర్చ జరుగుతుంది. అయితే అధికారంలో ఉంటూ.., ఎమ్మెల్యేగా హోదాను అనుభవిస్తూ రాజీనామా చేసి.., పార్టీ మారి, మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం అంటే అతి పెద్ద రిస్కు. సో.., ఈ పుకార్లలో అంత నిజాలు లేకపోవచ్చు కానీ…, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉండడం.., పార్టీ ఈయనపై అసంతృప్తిగా ఉండడం మాత్రం నూటికి నూరుపాళ్లు వాస్తవమే.! వెలగపల్లి మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి పుణ్యంతో గెలచాను అనీ, ఆయన దేవుడు అనీ ఎమ్మెల్యే మొదటి ప్రసంగంలోనే ఆయన ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు, అలాంటి వ్యక్తి అధికార పార్టీపై తిరుగుబాటు చేయడం వట్టి బోగస్ మాటలు అందువల్ల ఈ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేవు.

జగన్ దగ్గర జాబితా..!?

అయితే ఇవన్నీ సీఎం జగన్ కి తెలియక కాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర గడుస్తుంది. ఇప్పటికే మూడు దశల్లో నిఘా వర్గాల ద్వారా జిల్లా స్థాయిలో కీలక సమాచారం సేకరించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం తదితర వివరాలను సేకరించి పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాత నుండి జగన్ పార్టీపై కూడా దృష్టి పెట్టి వారానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేతో మాట్లాడతారని అంటున్నారు. అవినీతిలో, అసంతృప్తిలో ముందున్న ఎమ్మెల్యేలు… ప్రజలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలను మొదటి దశలో పిలిపించి నేరుగా మాట్లాడతారని సమాచారం. ఎవరెవరు పక్క పార్టీలతో టచ్ లో ఉన్నారు..? ఎవరు కోవర్టులుగా ఉన్నారు..? ఎవరు అసంతృప్తిని వినిపిస్తున్నారు..? ఎవరు చెడు ప్రచారం చేస్తున్నారు..? అనే దిశలో ఓ కీలక నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు.

“ఎవడి.. మాట వినడు.. సీతయ్య వెలగపల్లి’

సీతయ్య సినిమాలో సీతయ్య పాత్ర తెలుసుగా ఎవడి మాట వినడు ఈ సీతయ్య అనే డైలాగ్ మన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లికి సూటు అయింది, అందువలనేమో ఆయన సీతయ్య పాత్ర పోషిస్తున్నారు, ఎవరూ ఏమీ చెప్పిన వినే పరిస్థితి వెలగపల్లి కి లేదు,ఆయన చెప్పిందే వేదం అవతల వాళ్ళు ఏమి చెప్పిన నాయనా.. నీకు తెలియదు ఉండు.. అనే పదంతో ఎదుటి వారి బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వరూ సీతయ్య,జిల్లా, రాష్ట్రంలో చక్రం తిప్పిన పెద్ద కుటుంబాలకు చెందిన నేతలు అయినా, కూటి కి కుటుంబాలకు చెందిన వారు అయినా సరే వెలగపల్లి దృష్టిలో ఒక్కటే ఎందుకంటే ఆయన అధికార హోదాలో సుదీర్ఘంగా పనిచేయడం తో ఆయన ఆ హోదాలోనే మాట్లాడటంతో ఎవరూ ఏమీ చెప్పిన ఈ చెవిన విని అవతల చేవిలో వదిలివేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది, రాజకీయ పార్టీలలో చేరిన కూడా ఆయన రాజకీయ నాయకులు గా పరిణితిచెందలేదు,అందువలనే నేడు గూడూరు వైసీపీలో అణిచితిఏర్పడింది,అంతేకాకుండా వయస్సు కూడా 70 దాటడం తో ఆయనలోని ఆలోచనలు కూడా పిల్లలు మనసత్వం ఏర్పడింది,

గూడూరు లో వర్గపోరు అగాలంటే ఎలా…?

నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న వర్గపోరు ఏ నియోజక వర్గంలో లేదంటే అతిశయోక్తి లేదు,కారణం ఇక్కడ పెద్ద కుటుంబాలు ఉండటం, కాకలు తీరిన రాజకీయ నేతలు ఉండటం, ఒక్కప్పుడు గూడూరు,సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఎంపిక నల్లపరెడ్డి,నేదురుమల్లి కుటుంబాల పెద్దలు నిర్ణయించే వారు నేడు ఆ పరిస్థితులు లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్లడంతో ఆయనే అభ్యర్థులను ఖరారు చేశారు, అందువల్ల గూడూరు టికెట్ వెలగపల్లి చెంతకు చేరింది,వెలగపల్లి ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి గూడూరు లో నేతలు,కార్యకర్తలు మధ్య సమన్వయం లేదు, ఎమ్మెల్యే దారి సపరేటు అన్నట్లు ఆయన వ్యవహారం సాగుతోంది, దింతో నాయకులు,కార్యకర్తలు అయోమయంలో పడిపోయే దిక్కుతోచని స్థితిలో బాధలు అనుభవిస్తున్నారు,

వెలగపల్లిని తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీకి దింపితే…?

ప్రసుత్తం గూడూరు వైసీపీ అణిచితి ఏర్పడింది, ఇది తొలగాలంటే విశ్లేషకులు త్వరలోనే జరగబోవు తిరుపతి పార్లమెంట్ సభ్యుల ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గా వెలగపల్లిని నిలబెట్టి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పార్టీ కోసం పనిచేసిన పార్టీ విధేయులుగా గుర్తింపు ఉన్న మెరిగ మురళి, బత్తిని విజయకుమార్, రాధ జోత్స్నా లత, బాల చెన్నయ్య వంటి వారిలో ఒక్కరికి అవకాశాలు ఇస్తే గూడూరు వైసీపీ లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనీ భావిస్తున్నారు, లేని పక్షంలో పార్టీ విధేయలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి భర్తీ చేసిన కొంత మేర మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి అందువలన అధిష్టానం త్వరగా ఏదోఒక నిర్ణయం తీసుకొని గూడూరు లో వైసీపీ అంతర్గత వర్గపోరు నిర్ములన చేసి పార్టీని కాపాడాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *