భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్పెషల్ ఫోకస్

భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ ఎస్ వీ నాగేశ్వరరావు

నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగు గంగ భూసేకరణ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలుగు గంగ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్ వీ నాగేశ్వర రావు సూచించారు నెల్లూరు నగరంలోని నీలగిరి సంఘం ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గురువారం తెలుగు గంగ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు… అధికారులు వీటిపై మరింత దృష్టి సారించాలని సూచించారు… క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ బాబు, విజయ్ కుమార్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధు ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *