రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రాజకీయం స్పెషల్ ఫోకస్

రెడ్లుకు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

జిల్లా స్థాయి సమావేశంలో నాయకులు డిమాండ్

రిపోర్టర్
———–
ఎస్.హరిబాబు
94947 98868

నెల్లూరు నగరంలో నీ రాంజీ నగర్ 8 వ వీదిలో వున్నటువంటి ఆంధ్రప్రదశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాయంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద్భంగా రాష్ట్ర అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అగ్రవర్ణ పేదల జరిపిన పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 8 2019 నాడు 103 వ రాజ్యాంగాన్ని సవరించి అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10 శాతం EWS రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది ఆనాటి నుండి అనేక రాష్ట్రల లో విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేద విద్యార్దులకు రిజర్వేషన్ అమలవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఈ అగ్రవర్ణ పేదల 10 శాతం EWS రిజర్వేషన్ అమలు చేయకపోవడం వలన ప్రతి సంవత్సరం 30000 వేల అగ్రవర్ణ పేద విద్యార్థులు ఉద్యోగాల్లో నష్టపోతున్నారు కావున దయవుంచి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అగ్రవర్ణ పేద విద్యార్దులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేద రెడ్లు అనేక సంవత్సరాలు గా పేద రెడ్ల హక్కుల సాధనకై గ్రామాలనుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు నడిపారు, సబలు సమావేశాలు జరుపుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పేద రెడ్ల తో నెల్లూరు ,తిరుపతి , కర్నూలు, అనంతపురం లో బహిరంగ సభలు జరిపి రెడ్డి కార్పొరేషన్ కావాలని తీర్మానం చేసినారు. దానికి వైఎస్సార్సీపీ పార్టీ ఎన్నికల వాగ్దానం లో రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించింది అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు కాలం కావస్తున్నప్పటికి రెడ్డి కార్పొరేషన్ ప్రకటించక పోవడం వలన పేద రెడ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున దయ వుంచి వెను వెంటనే చట్ట బద్దతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ప్రకటిస్తూ 1000 కోట్ల నిధులను వెంటనే కేటాయించాలని ( డిమాండ్ ) విజ్ఞప్తి చేస్తున్నాము,
ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త బత్తిన సాయికుమార్ రెడ్డి ఐటీ కన్వీనర్ గోసల సురేంద్ర రెడ్డి , కోవూరు ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి కన్వీనర్ నరసింహారెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి, దుత్తలురు మండల కన్వీనర్ పుల్లారెడ్డి, ముత్తుకూరు కన్వీనర్ సుదేశ్ రెడ్డి, రాష్ట్ర విద్యార్ది విభాగం నాయకులు మురళి రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగ రెడ్డి సంక్షేమ సంఘం అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి మరియు సుధాకర్ రెడ్డి మరియు జిల్లా లోని అన్ని మండల కన్వీనర్ లు మరియు కో కన్వీనర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *